డర్బన్ సదస్సులో కాశ్మీర్ సమస్య
డర్బన్‌ః అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ ఊసెత్తెమని పాకిస్తాన్ నేత ముషారఫ్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా ప్రధాని వాజ్‌పేయి ప్రకటించి నెలకూడా తిరగకుండానే పాకిస్తాన్ తన పాతబుద్ధి బయటపెట్టుకున్నది.
డర్బన్‌లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరుగుతున్న జాతివివక్ష వ్యతిరేక సదస్సులో పాకిస్తాన్ అనూహ్యంగా కాశ్మీర్ సమస్యను లేవనెత్తింది. భారత ప్రభుత్వం కాశ్మీర్‌లో క్రూరమైన అణిచివేతకు పాల్పడుతున్నదని ఇప్పటివరకు ఈ అణిచివేత, మారణకాండలకు 75 వేల మంది బలయ్యారని పాకిస్తాన్ డర్బన్‌లో ఫిర్యాదు చేసింది.స్వయంనిర్ణయాధికారం కోసం సాగుతున్న పోరాటాన్ని ఉగ్రవాదంగా, టెర్రరిజాన్ని ఇస్లాంగా చిత్రీకరించి క్రూరంగా అణిచివేసే ప్రయత్నాలు కాశ్మీర్‌లో సాగుతున్నాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్‌పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చేసెప్టెంబర్‌లో వాజ్‌పేయి, ముషారఫ్‌లు భేటీ కానున్న నేపథ్యంలో సత్తార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications
