కాషాయీకరణపై రాష్ట్రాల హెచ్చరిక
న్యూఢిల్లీ: పాఠ్యాంశాల్లో ఏకపక్షంగా మార్పులు తలపెట్టవద్దని, తమ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే విద్యావిధానాన్ని రూపొందించాలని 13 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలో ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖవిద్యా విధానాన్ని కాషాయీకరణ చేయడం ఆందోళకరమైనవిషయమని, ఈ మార్పులు రాజ్యాంగం పేర్కొన్న ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థకు భంగకరంగా వున్నాయని సమావేశం అభిప్రాయపడింది.
జ్యోతిషం, పౌరోహిత్యాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సబ్జెక్టులుగా ప్రవేశపెడుతోందని, ఆర్ట్స్‌లో గానీ,సైన్సెస్‌లో గానీ వీటిని సబ్జెక్టులుగా భావించలేమనిసమావేశం అన్నది. ఈ విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను, జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.విద్యా మంత్రుల సదస్సు నిర్వహించకుండా ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు పాఠ్యాంశాల మార్పిడి తలపెట్టడం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోవిద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై నిపుణుల సలహాలు తీసుకునేందుకుసెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications
