డర్బన్ నుంచి అమెరికా నిష్క్రమణ
డర్బన్‌ః డర్బన్‌లో జరుగుతున్న జాతి వివక్ష వ్యతిరేక అంతర్జాతీయ సదస్సు నుంచి అమెరికా వైదొలగింది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా సదస్సును బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది.
తమ తమ ప్రతినిధి బృందాలను వెనక్కిరావల్సిందిగా ఈ రెండు దేశాలు ఆదేశించాయి. పాలస్తీనావిషయంలో ఇజ్రాయెల్ వైఖరిని ఖండిస్తూ ఈ సదస్సులో అనేక దేశాలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ చర్యకు కారణంగా చెబుతున్నారు. సదస్సు తీర్మానంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పరుష పదజాలంతో వున్న వ్యాఖ్యానాలను అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
ఈ దేశాలను శాంతింపజేయడానికి నార్వే వంటి దేశాలు చేసిన కృషి ఫలించలేదు. డర్బన్ సదస్సులో విశృంఖలత్వం చోటుచేసుకున్నదని, మానవహక్కుల కోసం ఏర్పాటైన ఈ సదస్సులో విద్వేశంతో గుడ్డిగా తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్‌ను దూషిస్తున్న కారణంగానే తాము కూడా సదస్సునుంచి వైదొలుగుతున్నట్టుగా అమెరికా వెల్లడించింది.












Click it and Unblock the Notifications
