హెచ్‌పిలో కంపాక్‌విలీనం
సాన్‌జోస్‌ః కంప్యూటర్ల ఉత్పత్తి రంగంలో గుత్తాధిపత్యానికి తెరతీస్తూ కంప్యూటర్ల ఉత్పత్తి సంస్థ హెవ్లెట్ పాకార్డ్ ప్రత్యర్ధి సంస్థ కంపాక్ కంప్యూటర్స్‌ను 2500 కోట్ల డాలర్ల స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. కంప్యూటర్ రంగంలోని మాంద్యం కారణంగా గత కొద్ది నెలలుగా ఈ రెండు సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి.
లాభాలపై వత్తిడితో పెద్దసంఖ్యలోనే ఉద్యోగాల్లో కోతవిధించాయి. ఈ డీల్ దరిమిలా ఏర్పడుతున్న మెగా కంప్యూటర్ల ఉత్పత్తి సంస్థ ఈ రంగాన్ని ఎదురులేకుండా పాలిస్తున్న ఐబిఎంకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం వుంది. ఈ మధ్యనే ముగిసిన పన్నెండు నెలలకాలంలో హెవ్లెట్ పాకార్డ్ రాబడి 4700 కోట్ల డాలర్లు వుండగా, కంపాక్ రాబడి 4000 కోట్ల డాలర్లు వుంది. కాగా ఐబిఎం రాబడి 9000 కోట్ల డాలర్లు పైగా వుంది. ఈ రెండు సంస్థల ఉమ్మడి రాబడి కూడా ఐబిఎం కన్నా స్వల్పంగా తక్కువ వుండటం గమనార్హం. అయితే ఈ రెండు సంస్థలు విలీనం తర్వాత చేపట్టే మార్కెటింగ్ వ్యూహాలను బట్టి ఐబిఎంను అధిగమించడం పెద్ద సమస్య కాకపోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications
