కృషి కంప్యూటర్ చీఫ్ లొంగుబాటు
హైదరాబాద్‌ః కృషి బ్యాంకు కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న ఎ రామకృష్ణ సోమవారం నాడు సిఐడి ఎదుట లొంగిపోయాడు. రామకృష్ణపై కూడా పోలీసులు అయిదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.
రామకృష్ణ లొంగుబాటు వల్ల ఇప్పటివరకు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కంప్యూటర్ పాస్‌వర్డ్ సమస్య పరిష్కారమైనట్టేనని భావిస్తున్నారు. కృషి బ్యాంకు లావాదేవీలన్నీ కంప్యూటరైజ్‌అయి వుండటంతో కుంభకోణం బయటపడినప్పడినుంచి కంప్యూటర్ తెరిచి పద్దులను పరిశీలించడానికి అధికారులు శతప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పాస్‌వర్డ్ తెలియకపోవడంతో ఇప్పటివరకువిషయాలు ఏవీ వెల్లడికాలేదు. రామకృష్ణ లొంగుబాటుకారణంగా ఈ సమస్య తీరిపోయింది. కంప్యూటర్లు తెరిచి చూస్తే డిపాజిట్ల మొత్తం ఎంత, రుణాలు ఎంతమందికి ఇచ్చారు. చైర్మన్, డైరెక్టర్లు కోట్లాది రూపాయలుస్వాహా ఏవిధంగా చేయగలిగారు వగైరా విషయాలన్నీ బయటపడే అవకాశం వున్నదనిఅంటున్నారు.
- కృషిబ్యాంకు స్కామ్ వార్తా కదంబం












Click it and Unblock the Notifications
