దేశం ఎమ్మెల్యే రాజీనామా?
హైదరాబాద్‌ః మహబూబ్‌నగర్ జిల్లా స్టాండింగ్ కమిటీల నియామకంలో జిల్లాకు చెందిన మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డితో తలెత్తిన విభేదాల వల్ల అమరచింత నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
సోమవారం నాడు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించారు. రాజీనామా లేఖనుఅందించేందుకు స్పీకర్ ప్రతిభాభారతిని కలుసుకునేందుకు కూడా దయాకర్‌రెడ్డి ప్రయత్నించగా ఆమె ఆస్ట్రేలియా వెళ్లినట్టుగా ఆమె పిఎస్ చెప్పారని తెలిసింది.స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శి కూడా ఆస్ట్రేలియా వెళ్లడంతో ఇన్‌చార్జీసెక్రటరీ రామిరెడ్డికి తన గన్‌మాన్ ద్వారా రాజీనామా లేఖను దయాకరరెడ్డి పంపించినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
