కలెక్టర్ ఆఫీసుల్లో పాస్‌పోర్టు దరఖాస్తు
హైదరాబాద్‌ః పాస్‌పోర్టుల జారీని వికేంద్రీకరించాలని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నిర్ణయించింది.
జిల్లాలనుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయాన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలతో అనుసంధానం చేసి కలెక్టరేట్లలోనే పాస్‌పోర్టు దరఖాస్తులస్వీకరణకు ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరుసీనియర్ అధికారులకు ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
