కోల్‌కతచీరలపై జగన్నాథుడు
భువనేశ్వర్‌ః ప్రపంచప్రఖ్యాత పూరి జగన్నాథుని రూపాన్ని చీరలపై ముద్రించి వ్యాపారం చేస్తున్న కోల్‌కతకు చెందిన కంపెనీపై హిందూమత సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయప్రధానాధికారి సామంత్రి కూడా సదరు కంపెనీకి లీగల్ నోటీసుపంపారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న లక్షలాది మంది హిందువులు భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం జగన్నాథుని రూపాన్ని ఆలయంలోని మరో రెండు దేవతామూర్తుల రూపాలను చీరలపై ముద్రించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మొదటి ఆర్‌ఎస్‌ఎస్ ఈవిషయంపై ఆందోళన ప్రారంభించింది.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్ సదరు కంపెనీకి వ్యతిరేకంగాపెద్దఎత్తున ఉద్యమం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కొద్ది కాలం క్రితమే అమెరికాకు చెందిన ఒక సానిటరీవేర్ కంపెనీ కమ్మౌట్‌లపై హిందూదేవతల రూపాలను ముద్రించిన వ్యవహారం, మరో కంపెనీ షూస్‌పై హిందూదేవతల రూపాలన ముద్రలను వేయడంపెనువివాదాన్ని రగిలించిన విషయం విదితమే.
విదేశీ కంపెనీల దుడుకుతనాన్నిఎదుర్కోవడానికి అమెరికాలోని ప్రవాస భారతీయ హిందూవులు సంఘటితమే పోరాటానికి దిగాల్సివచ్చింది. ఇప్పుడు దేశంలోనే ఒక కంపెనీ హిందూదేవతలను అవమానించే పనికి తలపడటం పట్ల హిందూ సంఘాలు ఆగ్రహంతో వున్నాయి. శివసేన వంటి అతివాద హిందూ సంస్థలు కలగజేసుకుంటే ఈవివాదం తీవ్రరూపం దాల్చే అవకాశం వున్నది. ఇప్పటివరకు వ్యక్తమైన నిరసనవిషయంలో కోల్‌కత కంపెనీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల పూరీ జగన్నాథ ఆలయానికి చెందినఅర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
