సౌతాఫ్రికా టూర్ కు సచిన్, కుంబ్లే రెడీ
న్యూఢిల్లీః ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనకు తాము సిద్ధంగా వున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిసిసిఐకి తెలిపారు. ఈవిషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జయంత్ లెలె వెల్లడించారు. తాను పూర్తి స్థాయిఫిట్ నెస్ తో వున్నట్లు సచిన్ టెండుల్కర్ మంగళవారం ఉదయం తనకు ఫోన్ చేసి చెప్పినట్లు లెలెవివరించారు.
కాలి బొటన వేలుకి గాయం కావడంతో సచిన్ శ్రీలంక పర్యటనకు దూరంగా వున్నవిషయం విదితమే. దక్షిణాఫ్రికా వైద్యుడు ఫెర్గూసన్ సచిన్ ను పరీక్షించి ప్రత్యేక షూస్ ను తయారు చేసి సచిన్ కు ఇచ్చాడు. ఆ షూస్ ధరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వుండవని సచిన్ చెప్పినట్లు లెలె తెలిపారు.
భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా వుంటున్న లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఫిట్ నెస్ ప్రకటించినట్లు లెలె తెలిపారు. హైదరాబాద్ ఆటగాడువి.వి.ఎస్. లక్ష్మణ్, జహీర్ ఖాన్ గురించి తనకు ఇంకా సమాచారంఅందలేదని ఆయన తెలిపారు. మోకాలు వాయడంతో లక్ష్మణ్ ఆస్ట్రేలియాలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. సౌతాఫ్రికా టూర్ షెడ్యూల్ ను ముందుకు జరపడంతో లక్ష్మణ్ ఏ మేరకు సిద్ధమవుతాడో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
