భూకంపంతో వణికిన దక్షిణాది
హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం తీవ్రతకు మంగళవారం రాత్రి దక్షిణాది రాష్టాలు కంపించిపోయాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో భూప్రకంపనాలు తీవ్రంగా కనిపించాయి. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. బంగాళాఖాతంలో పాండిచ్చేరి సమీపంలో భూగర్భంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రకంపనాలు సంభవించాయి. ఈ ప్రకంపనాలు సుమారు 260 కిలోమీటర్ల పరిధికి వ్యాపించడంతో దక్షిణాది రాష్ట్రలు ప్రకంపించాయి. ఈ తీవ్రత రెక్టర్‌స్కేల్ పై 5.6గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరి, కర్నాటక, కేరళతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూప్రకంపనాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, చిత్తూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భూమి తీవ్రంగా కంపించింది. తమిళనాడులో ముఖ్యంగా సముద్రతీరప్రాంత నగరాల్లో భూప్రకంపనాలు స్పష్టంగా కనిపించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంమినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రకంపనాల తీవ్రతస్వల్పంగా కనిపించింది. సముద్ర గర్భంగా లో వచ్చిన భూకంపం కాబట్టి తీవ్రత తక్కువగా వుందని, మళ్ళీ ప్రకంపనాలు సంభవించే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications