దాడులకు ముందుబ్రిటన్‌లో హైజాకర్లు
లండన్: అమెరికాలో దాడులకు తమ ఆత్మాహుతి యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికి ముందు ముందు ఈ ఏడాది 19 మంది హైజాకర్లలో 11 మందిబ్రిటన్‌లో ఉన్నట్లు తేలింది. కీలకమైన పథకం రచన సమావేశానంతరం ఐదుగురుజూన్‌లో అమెరికాకు వెళ్లినట్లు ఇంటలిజెన్స్ అధినేతలు భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కుచెందిన ఆల్-ఖైదా సంస్త స్థావరాన్నిగుర్తించగలమనే ఆశతో ఆ బృందానికి ఆశ్రయంకల్పించిన, నిధులు సమకూర్చినవారి ఆరాతీయాల్సిందిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) స్కాట్లాండ్ యార్డ్‌నుకోరినట్లు ది టైమ్స్ రాసింది.బ్రిటన్‌లో ఉన్నప్పుడు వాడినట్లుభావిస్తున్న హైజాకర్ల బ్యాంక్ ఖాతాలను,టెలిఫోన్ నెంబర్లను, ఫోర్జరీ క్రెడిట్‌కార్డులను ఎఫ్‌బిఐ స్కాట్లాండ్ యార్డుకుపంపింది.
అమెరికాలో దాడులకు రెండు రోజుల ముందునార్తర్న్ అలయెన్స్ కమాండర్ అహ్మద్ షామసూద్‌ను చంపిన ఇద్దరు ఆత్మాహుతిబాంబర్లు కూడా బ్రిటన్‌లోనేనివసించినట్లు ఆ పత్రిక మరో వార్తా కథనాన్నిప్రచురించింది.
బ్రిటన్‌లో జరిగే దర్యాప్తులో ఆత్మాహుతిబృందం గురించి వాస్తవాలు వెల్లడికాగలవని, తప్పుడు పాస్‌పోర్టులతో,గుర్తింపులతో వారు బ్రిటన్ చేరుకున్నట్లుభావిస్తున్నారు.












Click it and Unblock the Notifications