అన్ని పట్టాణాల్లో షాపింగ్‌ఫెస్టివల్స్
హైదరాబాద్: ప్రతి ప్రధాన పట్టణంలో షాపింగ్‌ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన పర్యాటక ప్రోత్సాహక మండలి బుధవారంనాడిక్కడ జరిగింది. టూరిజం అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగాన్ని 1700 కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ రహదారుల వెంబడి పర్యాటక అతిథి గృహాలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని చార్మినార్ చుట్టూలాన్‌ను ఏర్పాటు చేస్తామని సమావేశానంతరం పర్యాటక శాఖ మంత్రి ఇ.పెద్ది రెడ్డి విలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications