పాక్‌కు చైనా ఆర్థిక సహాయం
బీజింగ్: పాకిస్థాన్‌కు 1.21మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ప్రకటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో పాక్ చేస్తున్న కృషికి ఆయన పూర్తి మద్దతు తెలియజేశారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాకిస్థాన్ చేస్తున్న కృషిని చైనాఅర్థం చేసుకుంటుందని, గౌరవిస్తుందని ఆయన అన్నారు. జియాంగ్ జెమిన్ ఆదివారం పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
పాకిస్థాన్ తమకు సన్నిహిత మిత్రదేశమని, ఇస్లామాబాద్‌కు తమ మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో పాకిస్థాన్‌కు, ప్రపంచానికి తమ పూర్తి మద్దతు వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications