తాలిబాన్ అధికారంలో వుండరాదు: అమెరికా
వాషింగ్టన్:అఎn్ఘానిస్థాన్‌లో తాలిబాన్ ఎంతో కాలం అధికారంలో వుండకూడదని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ తమ నియంత్రణలోనే వున్నాడని తాలిబాన్ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్ నుంచి ఆ ప్రకటన వెలువడింది.
ఒసామాబిన్ లాడెన్, ఆల్-ఖైదాతో కలిసి తాలిబాన్ పని చేస్తోందని, అదిసరైంది కాదని వైట్‌హౌస్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్ర్యూ కార్డ్ అన్నారు. తీవ్రవాద చర్యల్లో తాలిబాన్ పాలు పంచుకోకూడదని, తాలిబాన్ ఇదే పద్ధతి కొనసాగిస్తే అధికారంలో వుండడానికివీలు లేదని ఆయన అన్నారు.
లాడెన్‌కు మాత్రమే కాకుండా ఆల్- ఖైదా వ్యవస్థకు సహాయం చేయడం తాలిబాన్ మానుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications