యుఎన్ వేదికపై పాక్ నోట కాశ్మీర్
ఐక్యరాజ్యసమితి: కాశ్మీర్ వివాదాన్ని పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై లేవనెత్తింది. కాశ్మీర్ సమస్యను పాకిస్థాన్ దౌత్యవేత్త షంషాద్ అహ్మద్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికపై లేవనెత్తారు.ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు పాకిస్థాన్ అందిస్తున్న సహాయాన్ని ఆయన ప్రశంసిస్తూ అకస్మాత్తుగా కాశ్మీర్ సమస్యను ఎత్తుకున్నారు.
ఈ రోజుకూ స్వయం నిర్ణయాధికార ప్రాథమిక హక్కును పొందలేని ప్రజలు ఉన్నారు. భద్రతా మండలి చేసిన తీర్మానం అమలు కావడం లేదు అని ఆయన అన్నారు. చారిత్రక తప్పిదాలను సరి చేయడానికి సాహసోపేత నిర్ణయాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కాశ్మీర్, పాలస్తీనా సమస్యలకు గౌరవ ప్రదమైన పరిష్కారాలు చూపడం వల్ల ఉగ్రవాదంపై జరిపే ప్రపంచ పోరుకు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడవని అహ్మద్ అన్నారు.












Click it and Unblock the Notifications