అల్ కైదా జీవాయుధ గిడ్డంగి ధ్వంసం
న్యూఢిల్లీః అఎn్గానిస్తాన్‌పై అమెరికా జరుపుతున్న దాడుల్లో అల్‌కైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రమాదకర రసాయనాలు, విషవాయువులు, జీవాయుధాలు వున్న గిడ్డింగి కూడా ధ్వంసమైందని ఇజ్రాయెల్ వార్తా పత్రిక ఒకటి పేర్కొంది.
ఒసామాబిన్ లాడెన్ సారథ్యంలోని అల్ కైదాకు చెందిన అత్యంత రహస్య స్థావరాన్ని అమెరికాన్ బాంబర్లు ధ్వంసం చేయగలిగినట్టుగా ఆ పత్రిక వెల్లడించింది. అమెరికా బయటకు చెప్పనప్పటికీ తాలిబన్లు, అల్‌కైదా శిబిరాలు, సైనిక గిడ్డంగులకు సంబంధించిన పక్కా సమాచారం ఆధారంగానే అమెరికన్ యుద్ధవిమానాలు దాడులు జరుపుతున్నట్టుగా ఆ పత్రిక వెల్లడించింది.అఎn్గాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వున్నజలాలాబాద్, ఖుత్ ప్రాంతాల్లోని టెర్రిస్టుల శిబిరాలుసర్వనాశనం అయినట్టుగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications