అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్... చైనా రియాక్షన్ మామూలుగా లేదుగా!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించడం, కాంగ్రెస్‌పై పట్టు సాధించడంపై పొరుగు దేశమైన చైనా మంగళవారం తొలిసారిగా స్పందించింది. అమెరికా ఎన్నికల ఫలితాలు ఆ దేశ అంతర్గత వ్యవహారమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ.. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను, సహకారాన్ని కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉందని వెల్లడించింది. బీజింగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. "అమెరికా మధ్యంతర ఎన్నికలు సంపూర్ణంగా వారి సొంత వ్యవహారం. ఇరు దేశాల అగ్రనేతల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందాలు, నిబంధనలను అమలు చేయడానికి చైనా సిద్దంగా ఉంది" అని వెల్లడించారు.
అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం
అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పెంచడానికి ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు చైనా కట్టుబడి ఉందని మావో నింగ్ పేర్కొన్నారు. పరస్పర గౌరవం, నిష్పాక్షికత, సమానత్వ ఆధారంగా వ్యూహాత్మక స్థిరత్వం కలిగిన నిర్మాణాత్మక సంబంధాలను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అంతర్గత రాజకీయంలో మార్పులు వచ్చినప్పటికీ.. చైనా మాత్రం అమెరికాతో సుస్థిర సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్ఫష్టమవుతోంది.

ఒకే ఏడాదిలో రెండుసార్లు కలిసిన జిన్‌పింగ్-ట్రంప్
ఈ ఏడాదిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య రెండు కీలకమైన శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. మే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా రాజధాని బీజింగ్‌లో పర్యటించగా.. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్య షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించి అనేక విడతల చర్చలు జరిపారు. ఈ భేటీలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని చైనా పేర్కొంది.
అపెక్ సదస్సులో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?
నవంబర్ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్-APEC) సదస్సు సందర్భంగా అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య త్రైపాక్షిక శిఖరాగ్ర భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగే ఈ సమావేశానికి సంబంధించి మూడో దేశాల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అమెరికా ఎన్నికల అనంతరం ఈ భేటీ జరగనుండటం అంతర్జాతీయ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.













Click it and Unblock the Notifications
