Ramayana Twitter Review: 'రామాయణ' మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' మూవీ ఒకటి. దీపావళి కానుకగా ఈ మూవీ నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక దేశాల్లో ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడిగా కనిపించనున్నారు.

అలాగే సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. ఈ చిత్రాన్ని దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అలాగే ప్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ కలిసి నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 10 కోట్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సినిమా చూసిన అభిమానులు అద్భుతంగా ఉందని.. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. రావణాసురుడిగా యష్ ఎంట్రీ సినిమాకే హైలెట్ గా ఉందని పేర్కొన్నారు. సినిమా చూస్తుంటే ఆ విజువల్స్ వీడియో తీసి స్టేటస్ పెట్టాలని అనిపించిందని అంతలా సినిమాలో విజువల్స్ ఉన్నాయని చెబుతున్నారు.

Ramayana movie the Twitter review for the movie The film set for worldwide release on November 5th

ఫైట్ సీన్స్ హైలెట్ గా.. ఫ్యాబులస్ గా ఉన్నాయని మాట్లాడుతున్నారు. రణ్ బీర్ కపూర్.. సాయి పల్లవి యాక్టింగ్ సినిమాకే హైలెట్ గా ఉందని వివరిస్తున్నారు. ఇలాంటి సినిమాను ఇప్పటివరకూ చూడలేదని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆదిపురుష్ కన్నా ఈ సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్టాఫ్ సూపర్ గా ఉందని.. సెకండాఫ్ మరింత అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మన చరిత్రను వివరించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అలాగే సాంగ్స్ కొంచెం అర్థం కావడం లేదని కానీ విజువల్ పరంగా బాగున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమా పుష్ప రికార్డ్స్ ను బ్రేక్ చేసేంతలా లేదని ఓ ప్రేక్షకుడు తెలిపాడు. మొత్తానికి ట్విట్టర్ రివ్యూ ప్రకారం రామాయణ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక పూర్తి రివ్యూ కోసం మరికొద్ది గంటలు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+