AP DSC Notification: కాసేపట్లో డీఎస్సీ నోటిఫికేషన్- పోస్టులెన్నోతెలుసా ?

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే 16 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి డీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీకి సిద్దమవుతోంది. ఈ మేరకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే జరిగితే ఇందులో 2721 పోస్టుల్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది.

ఏపీకి రేపు భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు..!
ఏపీకి రేపు భారీ వర్ష సూచన- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు..!

గత నెల 13వ తేదీనే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ అధికారులు పూర్తి స్దాయిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఇందులో మొత్తం 2721 ఖాళీలు భర్తీ చేయనుండగా.. వీటిలో కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 931 ఉండగా.. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరో 255 ఉన్నాయి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 1231 ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులు మరో 304 ఉన్నట్లు తెలుస్తోంది.

ap dsc notification to be released soon with 2721 teacher posts
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!

వీటితో పాటు ఇతర పోస్టుల్ని కలిపి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇవాళ విడుదల చేయబోయే డీఎస్సీ నోటిఫికేషన్ లో పరీక్షల షెడ్యూల్, దరఖాస్తుల వివరాలు, సిలబస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల కల తీరే అవకాశం ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా ప్రతీ ఏటా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టుల్ని భర్తీ చేసే వారు. ఇప్పుడు కూటమి సర్కార్ లోనూ ఆ సంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చారు. దీంతో ఏటా పడే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు రెగ్యులర్ గా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా అభ్యర్ధులు సమగ్రంగా ప్రిపేర్ అయి పరీక్షలు రాస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+