పాకిస్థాన్ లో బంగారం ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. మరీ ఇంత చీపా..? భారత్ తో పోల్చితే..!
భారత్ సరిహద్దు దేశం పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడి పేద, మధ్య తరగతి దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఆ దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఇక పాక్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 390 కు పైనే ఉంది.
అటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం కూడా తారాస్థాయికి చేరింది. అటు విదేశీ అప్పులు ఎలాగో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిణామాల మధ్య అక్కడి సంపన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏదైనా ఉందంటే అది బంగారం ధరలు అనే స్పష్టం అవుతోంది.
పాకిస్థాన్ లో ప్రస్తుతం బంగారం ధరలు తక్కువగానే ఉన్నట్లు సమాచారం. భారత్ తో పోల్చితే చాలా తక్కువ అని తెలుస్తోంది. ఉదాహరణకు నవంబర్ 4 బుధవారం నాటి వివరాలు చూస్తే పాకిస్థాన్ లో 24 క్యారెట్ల బంగారం ధర తులం భారత కరెన్సీ ప్రకారం రూ. 1,21, 654 గా ఉంది. అలాగే భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 1,43,105 గా ఉంది. ఈ లెక్కన ఇరు దేశాల మధ్య తులం బంగారం ధర రూ. 21,451 గా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర పాకిస్థాన్ లో రూ. 1,11,516 గా ఉండగా అదే 22 క్యారెట్ల బంగారం ధర భారత్ లో రూ. 1,31,742 గా ఉంది. ఈ లెక్కన చూస్తే ఇరు దేశాల మధ్య 22 క్యారెట్ల బంగారం మధ్య వ్యత్యాసం రూ. 20, 227 గా ఉంది.

అయితే బంగారం ధరల్లో ఇలా దేశాల మధ్య వ్యత్యాసం ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక కరెన్సీ.. దిగుమతి రేట్లు.. ట్యాక్స్ లు.. అలాగే మార్కెట్ ప్రీమియమ్ లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వివరిస్తున్నారు. అలాగే అటు ఇండియన్ రూపీ కు.. పాకిస్థాన్ రూపీకు డిఫరెంట్ ఎక్స్ చేంజ్ వ్యాల్యూస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక భారత్ లో బంగారం కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications
