పవన్ 'బాలు' ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా? ప్రపంచంలోనే 5 మాత్రమే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బాలు(ABCDEFG)' సినిమాలో ఆయన వేసుకున్న డిఫరెంట్ అండ్ స్టైలిష్ ప్యాంట్లు టాలీవుడ్‌లో ఎంతటి ట్రెండ్ సెట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ రోజుల్లో పవన్ ప్యాంట్ల స్టైల్ అభిమానుల్లో సృష్టించిన క్రేజ్ మామూలు కాదు. అయితే ఈ ఎఫర్ట్‌లెస్ కూల్ లుక్ వెనుక ఉన్న సీక్రెట్ గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

Scene Movie First Review: సూర్య 'సీన్' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..
Scene Movie First Review: సూర్య 'సీన్' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..

పవన్ కల్యాణ్ సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన దుస్తులను స్వయంగా డిజైన్ చేసిన రేణు దేశాయ్.. 'బాలు' సినిమా కోసం లండన్, మిలన్ వంటి అంతర్జాతీయ నగరాల్లో షాపింగ్ చేసిన అనుభవాలను పంచుకున్నారు. లండన్ షాపింగ్ సమయంలోనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా షారుఖ్ ఖాన్ కోసం దుస్తులు కొనడానికి అదే స్టోరుకు వచ్చేవారని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

Secret Behind Pawan Kalyan Balu Pants World War II Fabric Made Only 5 Pairs Renu Desai reveals

డేవిడ్ బెక్‌హామ్, పవన్ కల్యాణ్ మాత్రమే!
అయితే రేణు దేశాయ్ వెల్లడించిన అతిపెద్ద సంచలన విషయం ఏమిటంటే.. 'బాలు' సినిమాలో పవన్ ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ ఫ్రాబ్రిక్ గురించి తెలియజేశారు. ఈ మెటీరియర్ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అసలైన ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడింది. ఇటలీలో మిలన్‌లోని ఓ అరుదైన స్టోర్‌లో రేణు దేశాయ్ దీనిని కనుగొన్నారు. ఈ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ తో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 ప్యాంట్లు మాత్రమే తయారయ్యాయి. అందులో ఓ ప్యాంట్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా.. మరో ప్యాంట్‌ను పవన్ కల్యాణ్ కోసం రేణు దేశాయ్ దక్కించుకోగలిగారు.

ఆ తెలుగు సినిమా అంటే అసహ్యం.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్!
ఆ తెలుగు సినిమా అంటే అసహ్యం.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్!

ఒక్క ప్యాంట్‌కే రూ.75 వేలు..!
ఆ ప్యాంట్‌ను దక్కించుకోవడం అంత సులువుగా జరగలేదని రేణు దేశాయ్ వెల్లడించారు. అడ్వాన్స్ చెల్లించిన అనంతరం దాదాపు మూడు నెలల పాటు వేచి చూసి ఆ ప్యాంట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ కాలంలోనే ఆ ఒక్క ప్యాంట్ ధర ఏకంగా రూ.75,000. సినిమా నిర్మాత అశ్వనీ దత్ ఆ ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రొడక్షన్ బడ్జెట్‌పై ఈ అదనపు భారం పడటం పవన్ కల్యాణ్‌కు అసలు ఇష్టం లేదని రేణు దేశాయ్ చెప్పారు. కానీ సినిమా విడుదలై దశాబ్ధాలు గడిచినా గుర్తుండిపోయేలా ఈ కాస్ట్యూమ్ స్టైల్ నిలుస్తుందని చిత్రబృందాన్ని ఒప్పించి ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేశారు. రేణు దేశాయ్ నమ్మకం నిజమైంది. రెండు దశాబ్ధాలు గడిచినా 'బాలు' సినిమాలోని పవన్ లుక్ నేటికీ అభిమానుల్లో అరుదైన ట్రెండ్‌గా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+