నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. భద్రతా ఏర్పాట్లు పూర్తి..
ఏపీలో ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు 18,843 మంది పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 38 వేల మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.
ఇవాళ జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు.. 1,41,332 మంది పోలింగ్ అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు 9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసింది.

ఇదిలా ఉంటే పట్టణ ఎన్నికలు ఇచ్చిన విజయోత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకూ కూటమి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పట్టణ ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్ రేట్ ను మించి స్థానాలు గెలవాలన్నారు. అలాగే పొత్తు ధర్మం పాటించని వారికి పార్టీలో స్థానం లేదని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications
