విద్యార్థులు కేవలం పరీక్షలు, మార్కులకే పరిమితం కాకూడదు: సీఎం చంద్రబాబు

విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఏకాభిప్రాయంతో పారదర్శకమైన, విశ్వసనీయమైన జాతీయ పరీక్షా విధానాన్ని రూపొందించాలని అన్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థికైనా, ఏ భాష మాట్లాడే విద్యార్థికైనా సమాన అవకాశాలు, న్యాయం జరిగేలా సంస్కరణలు ఉండాలని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

సచివాలయానికి వచ్చిన నందన్ నీలేకనికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జాతీయ పరీక్షా విధానంపై టాస్క్ ఫోర్స్ కు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. నేటి తరం విద్యార్థులు, యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షల విధానం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం పరీక్షలు, మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం పెంపొందించేలా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్‌ లో అమలవుతున్న విధానాలు, సాంకేతికత వినియోగాన్ని వివరించారు.

అలాగే దేశవ్యాప్తంగా పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తన ఆలోచనలను పంచుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా పరీక్షల విధానాన్ని రూపొందించాలని లోకేష్ సూచించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా భాష, విద్యా విధానం, ధృవీకరణల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ స్థాయిలో సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా లేక్ ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

CMChandrababu offers suggestions regarding the national examination system meets Nandan Nilekani

పరీక్షల విధానంలో సమూల మార్పుల దిశగా..

పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలను అరికట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్టు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని.. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు, ఎదురవుతున్న సమస్యలు, సంస్కరణలపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. ఏపీ అమలు చేస్తున్న విధానాలపై ఆసక్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+