భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అలాగే ఉంది. అటు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఆంక్షలు అమలులోనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. హార్మూజ్ జలసంధిని దాటడం కోసం కొన్ని దేశాలకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో భారత్ కూడా ఉంది. భారత్ తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ తదితర దేశాలకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు ఇరాన్ కు చెందిన లా మేకర్ అమిర్ హయత్ మొఘద్దామ్ పేర్కొన్నారు. ఈ నాలుగు దేశాలకు చెందిన నౌకలు హార్మూజ్ జలసంధి గుండా ఇప్పుడు ఉచితంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లొచ్చిని స్పష్టం చేశారు. అటు అమెరికా కూడా ఈ దేశాల నౌకలను అడ్డుకునే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

" మేము ప్రస్తుతం భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతించాం. దాంతో హార్మూజ్ జలసంధి గుండా ఈ నౌకలు ఎలాంటి నిర్భందం లేకుండా వెళ్లవచ్చు. అటు అమెరికా కూడా ఈ నౌకల విషయంలో అడ్డురాదు" అని ఇరాన్ లా మేకర్, ఇరాన్ పార్లమెంట్ కు చెందిన డిప్యూటి ఛైర్మన్ అమిర్ హయత్ మొఘద్దామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరాన్ కు చెందిన స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఈ దేశాల విషయంలో ఇరాన్ కు ఆసక్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Iran grants special exemption to Indian vessels in the Strait of Hormuz Iran india relations news

అలాగే భారత్ నుంచి ఔషధాల దిగుమతిని సులభతరం చేసేందుకు.. ఇక చైనా నుంచి రాజకీయ మద్దతు పొందడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అమీర్ హయత్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్‌ జలసంధిలో నౌకాయానంపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మిగతా దేశాలను పక్కనపెట్టి భార‌త్ తో పాటు మిత్ర‌దేశాల నౌక‌ల‌కు ఇరాన్ ప్ర‌త్యేక మిన‌హాయింపు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల గుండా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ఇక భారత్ తన అవసరాల కోసం దిగుమతి చేసుకునే ముడి చమురులో అత్యధిక శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+