ఆఫ్ఘన్ బంకర్లపై అమెరికా బాంబులు
వాషింగ్టన్‌ః ఆఫ్ఘనిస్తాన్ కు అతిపెద్ద ఆయుధం అయిన బంకర్లపై అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. బుధవారం రాత్రి ఆఫ్ఘన్ బంకర్లపై అమెరికావిమానాలు 5వేల పౌండ్ల బరువున్న బంకర్ విధ్వంసకర బాంబులను వేసింది. యుద్ధం ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో బంకర్ విధ్వంసకర బాంబులను ప్రయోగించడం ఇదే ప్రథమం. అమెరికా దాడులకు పాల్పడుతున్నదనే అనుమానం వచ్చిన వెంటనే వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు బంకర్లలలో తలదాచుకుంటున్నారు.
తాలిబన్లసైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి అంతా ఈ బంకర్లలలోనే వున్నది. ఈ బంకర్లను ధ్వంసం చేస్తే తప్ప అమెరికాకు ఆఫ్ఘన్ పై ఆధిపత్యం రాదు. ఈ పరిస్థితుల్లో మరిన్ని బంకర్ విధ్వంసకర బాంబుల్ని ప్రయోగించాలని అమెరికా ఆలోచిస్తున్నది. అమెరికా మంగళ, బుధవారాల్లో ప్రయోగించిన భారీ బాంబులు అనేక బంకర్లనుసర్వనాశనం చేసినట్లు సమాచారం అందింది.












Click it and Unblock the Notifications