నైపాల్‌కు సాహిత్యంలో నోబెల్‌

న్యూయార్క్‌: ప్రముఖ ఇండో- ఆంగ్లియన్‌ రచయితవి.యస్‌. నైపాల్‌కు 2001 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఏకీకృత దృష్టికోణంతో కూడిన వ్యక్తీకరణ, నిజాయితీ వల్ల నైపాల్‌ రచనల్లో చీకటిలో దాగిన చరిత్రలు కనిపించాయని రాయల్‌స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. నైపాల్‌ ఫిక్షన్‌కు, నాన్‌-ఫిక్షన్‌కు మధ్య గల తేడాను తుడిపేశారని రాయల్‌స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ప్రశంసించింది. నైపాల్‌ సాహిత్య పరిధి వెస్ట్‌ ఇండియన్‌ ఐలాండ్‌లోని ట్రినిడాను దాటివిస్తరించిందని, ఇండియా, ఆఫ్రికా, అమెరికా, ఇస్లామిక్‌ దేశాలకు ఆయన పరిధివిస్తరించిందని ఆ ప్రకటనలో అన్నారు. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి లభించిన భారతీయుల్లో నైపాల్‌ రెండవ వారు. అంతకు ముందు రవీంద్రనాథ్‌ టాగోర్‌కు సాహిత్యంలో నోబెల్‌ బహుమలి వచ్చింది.

ఇతరుల మాదిరిగా కాకుండా నైపాల్‌ తన జ్ఞాపకాల నుంచి రచనలు చేసే సాధికారతను సాధించారని ఆ ప్రకటనలో కొనియాడారు.నైపాల్‌ తొలి రచన ది మిస్టిక్‌ మాస్యూర్‌. దాని వెంటనే మిగుయెల్‌స్ట్రీట్‌ అనే కథా సంకలనాన్ని వెలువరించారు. ఈ రెండు పుస్తకాలు నైపాల్‌ హాస్య దృష్టిని,స్ట్రీట్‌ లైఫ్‌ను చిత్రించే ఆయన ప్రతిభను ప్రతిబింబిస్తాయి.
ఆయన రాసిన ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌ విశేష ప్రచారం పొందింది. భారతదేశ పాఠకులను ఇదివిశేషంగా ఆకర్షించింది. ది ఎనిగ్మా ఆఫ్‌ అరైవల్‌ మాస్టర్‌ పీస్‌. నైపాల్‌ ఒక ఆంథ్రాపాలజిస్టుగా ఇంగ్లాండను దర్శించిన తీరును ఈ పుస్తకం పట్టిస్తుంది. నైపాల్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయి. 1971లో బుకర్‌ ప్రైజ్‌ లభించింది. సృజనాత్మక రచనలకు ఇచ్చే టిఎస్‌ ఇలియట్‌ అవార్డను ఆయన 1986లోఅందుకున్నారు.

నెపాల్‌ రచనలు కొన్ని-

ది మిస్టిక్‌ మాస్యూయర్‌, 1957
మిగ్యూయల్‌ స్ట్రీట్‌, 1959
ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌, 1961
ది మిడిల్‌ పాసేజ్‌: ఇంప్రెషన్స్‌ ఆఫ్‌ ఫైవ్‌ సొసైటీస్‌, 1962
మిస్టర్‌ స్టోన్‌ అండ్‌ ద నైట్స్‌ కాంపానియన్‌, 1963
ఎ ఫ్లాగ్‌ ఆన్‌ ద ఐలండ్‌, 1967
ద లాస్‌ ఆఫ్‌ ఎల్‌ డొరడో: ఎ హిస్టరీ, 1969
ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌, 1971
ద ఓవర్‌ క్రౌడెడ్‌ బర్రాకూన్‌ అండ్‌ అదర్‌ ఆర్టికల్స్‌, 1972
గెరిల్లాస్‌, 1975
ఇండియా: ఎ వూండెడ్‌ సివిలైజేషన్‌, 1977
ఎ బెండ్‌ ఇన్‌ ద రివర్‌, 1979
ఎ కంగో డైరీ, 1980
అమాంగ్‌ ద బిలీవర్స్‌: ఇన్‌ ఇస్లామిక్‌ జర్నీ, 1981
ద ఎనిగ్మా ఆఫ్‌ అరైవల్‌, 1987
ఇండియా: ఎ మిలియన్‌ మ్యుటినీస్‌ నవ్‌, 1990
ఎ వే ఇన్‌ ద వరల్డ్‌, 1994
బియాండ్‌ బిలీఫ్‌: ఇస్లామిక్‌ ఎక్షకర్షన్స్‌ అమాంగ్‌ ద కన్వర్టెడ్‌పీపుల్స్‌, 1998
రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌: ఎ పర్సనల్‌ అకౌంట్‌, 2000
హాఫ్‌ ఎ లైఫ్‌, 2001

  • తెలంగాణాపైనైపాల్‌ దృష్టి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+