అమెరికా సైనిక అడ్డాగా పాకిస్తాన్
ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్ అమెరికాసైనిక స్థావరంగా మారిపోతున్నది. కనీసం రెండు వేల అమెరికా పదాతి దళాలు, పాకిస్తాన్ కు చెందిన మూడు ఎయిర్ బేస్ ల నిండా యుద్ధవిమానాలు కవాతు చేస్తున్నాయి. మరోవైపు పాక్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోపెద్ద సంఖ్యలో అమెరికా సైన్యాలను మొహరిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోవున్న పాక్‌విమాన స్థావరాలు జకోబాబాద్, దల్బాందిన్, పాన్సి లను అమెరికా ఉపయోగించుకుంటున్నది.
1950 తరువాత పాక్ లో ఇంతపెద్ద మొత్తం లో అమెరికా సైన్యం, యుద్ధ విమానాలు మొహరించడం ఇదే ప్రధమం. వందలాది అమెరికాసైనికులు, 50 అమెరికా యుద్ధ హెలికాప్టర్లు, వందలాది యుద్ధవిమానాలు ప్రస్తుతం పాక్ లో వున్నాయి. ఇవికాక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటుకు వందలాది మంది సాంకేతిక నిపుణులు పాక్ లో మకా వేశారు.
పీలక దాకా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్తాన్ కు అమెరికా పై జరిగిన దాడి దాదాపు వరంగా పరిణమించింది. పాక్ రుణాలన్నీ మాఫీ చేసేందుకు కూడా అమెరికా హామీ ఇచ్చినట్లు వార్తలువినిపిస్తున్నాయి. అమెరికాకు మరింతగా సాయం అందించడం వల్ల ముస్లిం దేశాల మధ్య చులకన కావడం సంగతి అటుంచితే పాకిస్తాన్ కు ఈ యుద్ధం వల్ల బాగానే ముడుతున్నది.












Click it and Unblock the Notifications
