హైదరాబాద్‌ః ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఇంతకు ుంచి ప్రభుత్వం ఏdు చేయలేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. 20 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె షయంలో ప్రతిష్ఠంభన నెలకొనడానికి కార్మిక సంఘాల నేతల వైఖరే కారణం అని ఆదివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన లేకరుల సమావేశంలో మర్శించారు. కనీసం ఆర్టీసీ ఉద్యోగులు కాని వారు కార్మిక నేతలుగా వ్యవహరిస్తూ సమ్మెను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆర్టీకీ కార్మికులు పలు డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా వున్నదని, జీతాలను 15 శాతం పెంచడం ద్వారా మరో 150 కోట్ల రూపాయల భారం మోయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల కార్మిక సంఘాలు సమ్మెను ఉదృతం చేస్తున్నాయని చంద్రబాబు మర్శించారు.
మరోవైపు ఆదివారం నాడు కూడా పలు చోట్ల ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సమ్మెను ఉదృతం చేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎ.పి.ట్రాన్స్ కో మజ్దూర్ యూనియన్ నేత నాగేశ్వరరావు ఆదివారం నుంచి హైదరాబాద్ లో ఆమరణ దీక్ష ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
