హైదరాబాద్‌ః నెక్లెస్ రోడ్‌లో కిడ్నాపైన వ్యాపారి కుమారుడు ఆశీష్‌అగర్వాల్ శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.
కిడ్నాపైన ఆశీష్ తాను కిడ్నాపర్ల చెరనుంచి వారి కనుగప్పి తప్పించుకున్నట్టుగా ఇంటికి ఫోన్ చేయడంతో డిసిపి ఉమేష్ షరాఫ్ నాయకత్వంలో ప్రత్యేక బృందం ముంబాయి బయలుదేరి వెళ్లి ఆయన్ను తీసుకుని వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ నాటకం కావచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తండ్రినుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజడానికి కిడ్నాప్ నాటకం ఆడివుంటాడనిఅంటున్నారు. లేదంటే కిడ్నాపర్లు కోరిన రెండు కోట్ల రూపాయలను ఆశీష్ కుటుంబ సభ్యులు చెల్లించి ఆయన్ను డుదల చేయించివుంటారని చెబుతున్నారు. ఈ రెండు అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప కిడ్నాపర్ల చెరనుంచితానే తెలిగా తప్పించుకున్నట్టుగా ఆశీష్ చెబుతున్న కథనం సినిమాఫక్కీలో వున్నదని వారుఅంటున్నారు.
ఏడుగురు ఆగంతకులు తనను కిడ్నాప్ చేసి టాటాసుమోలో ముంబాయికి తీసుకువెళ్లారని మార్గంలో వారు పరీతంగా మద్యంసేంచి ఒళ్లుతెలియకుండా పడిపోవడంతో తాను సుమో ండోనుంచి దూకి తప్పించుకున్నట్టుగా ఆశీష్ పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
