కర్నూలు, చిత్తూరులో పర్యటించిన కేంద్రబృందం
హైదరాబాద్‌ః తుపాను తాకిడికి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర బృందం మంగళవారం నాడు కర్నూలు, చిత్తూరు జిల్లాలలో పర్యటించింది.
రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, చాగలమర్రి మండలాల్లో ఇసుక మేట వేసిన పొలాలను సందర్శించింది. ఆ తరువాత చిత్తూరు జిల్లాలో తెలుగుగంగ కాలువకు పడిన గండ్లను కూడా కేంద్ర బృందం పరిశీలించింది. బుధవారం నాడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకొని చర్చలు జరుపుతామని కేంద్ర బృందం తెలిపింది.












Click it and Unblock the Notifications
