బ్లోయెంఫాంటెన్‌ః సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. భారత్ బ్యాట్స్ మెన్ పూర్తిగా ఫలం కావడంతో సౌతాఫ్రికా సునాయాసంగా జయం సాధించింది. లక్ష్మణ్ మొదలుకొని సచిన్, గంగూలీ, సెహవాగ్ తో సహా అందరూ చతికిల పడడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 237 పరుగులకే ఆలౌట్‌యింది. చివర్లో శ్రీనాధ్, నెహ్రాలు జోరుగా ఆడకపోతే భారత్ ఇన్నింగ్స్ ఓటు పాలయ్యేదే.
భారత్ రెండో ఇన్నింగ్స్ లో దాస్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. లక్ష్మణ్ 29 పరుగులకు, సచిన్ 15 పరుగులకు, గంగూలీ 30,సెహవాగ్ 31 పరుగులకు వరుసగా పెలియన్ దారి పట్టారు. దీనితో సౌతాఫ్రికా ఎదుట నామమాత్రంగా 54 పరుగులు లక్ష్యాన్ని వుంచింది. నామమాత్ర లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఓ కెట్ కోల్పోయి ఓ రోజు ఆట ుగిలి వుండగానే సాధించి జయకేతనం ఎగుర వేసింది. తొలిఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 6 కెట్లు సాధించిన షాన్ పోలాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దేశీ గడ్డపై, అదీ ఫాస్ట్ ట్రాక్ లపై భారత్ చతికలపడటం ఖాయం అని గంగూలీ బృందం మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications
