హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా అల్పపీడనంగా మారుతున్నది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో 11, గూడూరు, ఒంగోలుల్లో 5సెంటీdుటర్ల చొప్పున వర్షం కురిసింది. రానున్న 48 గంటల్లో కోస్తా అంతటా ఒక మోస్తర నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ లో కూడా జల్లులు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల కుంభవృష్టి పడే అవకాశం వుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాతీరం ప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కిలోdుటర్ల వేగంతో గాలులు dస్తాయని అధికారులు వరించారు.












Click it and Unblock the Notifications
