ఫుతిన్‌తో చర్చల్లో కాశ్మీర్ ప్రస్తావన
మాస్కోఃరష్యా అధినేత ఫుతిన్‌తో భారత ప్రధాని వాజ్‌పేయిజరుపుతున్న శిఖరాగ్ర చర్చల్లో కాశ్మీర్ అంశంకూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం వుంది. ఈ షయం భారత వర్గాలు తెలిపాయి. ప్రపంచదేశాల పర్యటనలో భాగంగా రష్యాకు వచ్చిన ప్రధాని వాజ్‌పేయి మంగళవారం నాడు పుతిన్‌తో ముఖాముఖి చర్చలు జరుపనున్నారు.
ఈ చర్చల తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఇద్దరు నేతల సంతకాలతో మాస్కో డిక్లరేషన్ వెలువడుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సిన అవసరం, టెర్రరిజాన్ని ప్రొత్సహిస్తున్న దేశాల పీచమణచడం కూడా ఈ డిక్లరేషన్‌లో వుంటే అవకాశం వుంది. ద్వైపాక్షికఅంశాలు కూడా ఇందులో చోటుచేసుకుంటాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధంపై ఈ ఇద్దరు నేతలు మంతనాలు జరుపుతారు. ఫుతిన్‌తో చర్చలకు ముందుగా ప్రధాని రష్యాస్పీకర్ గెన్నడి సెల్జినోవ్‌ను కూడా కలసి మంతనాలు జరిపారు. యుద్ధానంతరంఅఎn్గాన్‌లో ఏర్పడే ప్రభుత్వంలో తాలిబన్ల ప్రమేయం వుండరాదని వారు అభిప్రాయపడ్డారు. భారత్‌తో పాటు రష్యా కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని వాజ్‌పేయి అన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు కలిసిపోరాడుతాయని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలన్నీ తొలిసారిగా ఏకతాటిపైకి వచ్చాయని ఇది శుభపరిణామమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
