హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మె మంగళవారం నాటికి 23వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది సంఖ్యంలో ప్రైవేటు బస్సులను నడుపుతున్నప్పటికీ ఆ బస్సులు సరిపోక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు సమ్మెను ఉదృతం చేశాయి. అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోయాయి. అనంతపురంలో నక్సలైట్లు మూడు ఆర్టీసీ బస్సులను దగ్ధం చేశారు. తిరుపతిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు.
గుంటూరులో స్కూటర్ ర్యాలీ జరిగింది. వరంగల్ లో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించడంతోపెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి పోయింది.
అనంతపురంలో ఆర్టీసీ కార్మికులు కుటుంబాలు ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో ఆర్టీసీ కార్మికులు పిల్లలు ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్ లో ఎఐటియుసి, సిఐటియు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించాయి. ఆర్టీసి కార్మికులు న్యాయపరమైన డిమాండ్లకు మద్దతుగా ఐఎన్ టియుసి సమ్మెకు మద్దతు ఇస్తుందని ఆ సంస్థ నేతపి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మె నానాటికీ తీవ్రతరం అవుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సందట్లో సడేుయా అన్న చందంగా ఆర్టీసీ సొమ్మును దళారులు దండుకుంటున్నారనే మర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications
