ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
మాస్కోః ఉగ్రవాదంపై ఉమ్మడిపోరాటం జరపాలని భారత్ - రష్యాలు ప్రతినబూనాయి. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం తరువాత ఏర్పడే ప్రభుత్వంలో తాలిబన్లకు భాగస్వామ్యం వుండరాదని ఉభయ దేశాలు తీర్మానించాయి.సైనిక, రక్షణ రంగాలతో పాటు ధ రంగాలకు చెందిన పలుఅంశాలపై పరస్పర సహకారానికి నాంది పలికే ఉమ్మడి డిక్లరేషన్ పై వాజ్‌పేయి, పుతిన్ మంగళవారం సంతకాలు చేశారు.
భారత్-రష్యా భాయీ భాయీ
మాస్కోః భారత-రష్యా సంబంధాల మధ్యనూతనాధ్యాయానికి ప్రధాని వాజ్ పేయి, అధ్యక్షుడు పుతిన్‌శ్రీకారం చుట్టారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మకభాగస్వామ్యానికి మాచర్చలు బాటలు వేసినట్లుసుదీర్ఘ చర్చల అనంతరం ఉభయ దేశాధినేతలు హర్షంవ్యక్తం చేశారు. భారత్ తో నిజమైన వ్యూహాత్మకభాగస్వామ్యానికి నాంది జరిగిందని పుతిన్‌చెప్పగా, రష్యాతో గల ప్రత్యేక సంబంధాలపై భారత్‌లో రాజకీయ ఏకాభిప్రాయం వున్నదని వాజ్ పేయిచెప్పారు.
భారత్ రష్యాలు ఉగ్రవాదంపై పోరు షయంలోఒకే బాటలో పయనిస్తున్నాయని పుతిన్ చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలు లేని ప్రశాంత ఆసియా ఖండం లసిల్లాలనేదే భారత్, రష్యా ఆకాంక్ష అని వాజ్‌పేయి వరించారు. అక్టోబర్ లో భారత్ లో పర్యటించిన పుతిన్ ఉభయ దేశాల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలికారని వాజ్‌పేయి పుతిన్ ను ప్రశంసించారు. భారత్ పరిణామాలను రష్యా సునిశితంగా పరిశీలిస్తునే వున్నదని పుతిన్ వ్యాఖ్యానించడం శేషం.












Click it and Unblock the Notifications
