నలుగురు అమెరికన్‌సైనికుల మృతి
కాబూల్‌ః ఆకాశ యుద్ధానికే పరిుతమైన అమెరికా తన పదాతి దళాలను కూడా రంగంలోకి దించితే తాలిబన్ల దెబ్బఏుటో రుచిచూపిస్తామని తాలిబన్ నేతలు ప్రకటించారు. పౌర నివాసలపైనే అమెరికా గురిచూసి దాడులు చేస్తున్నదని వారు ఆరోపించారు.
ఈ దాడుల్లోపెద్దసంఖ్యలో అమాయకపౌరులు మరణించినట్టుగా వారుపేర్కొన్నారు. కాగా తాలిబన్‌ల ఎదురుదాడిలో నిప్పంటుకున్న ఒక అమెరికన్ హెలికాప్టర్ పాకిస్తాన్ భూభాగంలో కూలింది. ఈ ప్రమాదంలో నలుగురుసైనికులు మరణించినట్టుగా తెలిసింది.
నెలరోజులుగా మానదాడులు సాగిస్తున్న లక్ష్యానికి ఎంత దూరంలో వున్నామో తేల్చుకోలేకుండా వున్న అమెరికా మరిన్ని మానదాడులకు సమాయత్తం అవుతున్నది. కజికిస్తాన్‌లోని మానాశ్రయాలను కూడా ఉపయోగించుకుని దాడులు చేసే ఆలోచనలో అమెరికా వున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపుపెద్ద సంఖ్యలో పదాతి దళాలను కూడా అమెరికాఅఎn్గాన్ కదన రంగానికి తరలిస్తున్నది. కొన్ని డిజన్లు ఇప్పటికేఅఎn్గాన్‌లో కాలుమోపినప్పటికీ ఇంకా ముఖాముఖి పోరుకు మాత్రం దిగలేదు. గత నెలరోజుల వైమానిక దాడులతో తాలిబన్ల నడుములు రిగినట్టుగా అమెరికా చేస్తున్న ప్రచారాన్ని తాలిబన్లు ఎద్దేవా చేస్తున్నారు. తమను దెబ్బతీయడం అమెరికా తరం కాదని వారు సవాలు సురుతున్నారు.












Click it and Unblock the Notifications
