వరంగల్: వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బుధవారం జావలిన్‌గొంతులో దిగి సాంబరాజు మురళి (18) అనే అథ్లెట్ మృతి చెందాడు.
వరంగల్: వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బుధవారం జావలిన్‌గొంతులో దిగి సాంబరాజు మురళి (18) అనే అథ్లెట్ మృతి చెందాడు.
జిల్లా స్థాయి గ్రాdుణ క్రీడల ఎంపిక సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. మురళి నిర్వాహకులకు సహాయకుడిగా పని చేస్తున్నాడు. టేపు పట్టుకుని మరో క్రీడాకారుడు జావలిన్ ఎంత దూరం సిరాడో కొలుస్తున్నాడు. ఇదే సమయంలో పరుగు పోటీలు జరుగుతున్నాయి.
ఈ పరుగు పోటీల్లో తనస్నేహితుడు ఎంత దూరంలో ఉన్నాడో చూడడానికి మురళి తల తిప్పాడు. అంతే, ఓ క్రీడాకారుడు సిరిన జావెలిన్ మృత్యు రూపంలో వచ్చి మురళి గొంతులో దిగబడింది. తీవ్రంగా గాయపడిన మురళిని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా వున్న ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది క్షణాలకే మురళి తుదిశ్వాస వదిలాడు.
సాంబరాజు మురళి హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అథ్లెటిక్స్ వంద dుటర్ల హర్టిల్స్‌లో మురళి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సాధించి మంచి యువ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. మురళి తండ్రి లక్ష్మయ్య ఆర్టీసిలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మురళి మృతితో జిల్లా స్థాయి గ్రాdుణ క్రీడలు వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications
