తాలిబన్ కాన్సూలేట్ మూత
కరాచిః తాలిబన్ల షయంలో ఇప్పటివరకు చూపిస్తున్న మెత్తదనం కూడా పాకిస్తాన్‌లో కనుమరుగవుతున్నది. కరాచిలోని తాలిబన్ల కాన్సూలేట్ కార్యాలయాన్ని మూసివేయాల్సిందిగా పాక్ ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది.
పాకిస్తాన్‌లో పెద్దఎత్తున సాగుతున్న అమెరికా వ్యతిరేక ర్యాలీలకు హాజరవుతూ ప్రజలను రెచ్చగొట్టే ధంగా కరాచిలోని తాలిబన్ కాన్సూల్ రెహ్మతుల్లా కకజ్డా మాట్లాడుతున్నట్టుగా ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
తాలిబన్లతో ఇప్పటికీ దౌత్య సంబంధాలు వున్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయంతో పాటు కరాచిలో కాన్సూలేట్ కార్యాలయం వుంది. ఇదిలా వుండగా తాలిబన్ రాయబారి జయీఫ్ పై కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పలు ఆంక్షలు ధించింది. జయీఫ్ ఈ ఆంక్షలను ఖండిస్తూ అమెరికా రాయబారి లేకరుల సమావేశంపై కూడా ఇదే ధమైన ఆంక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఎn్గాన్, అమెరికా షయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నట్టుగా ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications
