పారిస్‌ః తీవ్రవాదాన్ని అంతం చేసేందుకే అమెరికాతో చేతులు కలిపినట్లు పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు. బుధవారం ఇరాన్ పర్యటించి అక్కడి నుంచి ఆయన గురువారం నాడు ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు చిరాక్ తో ఆయన గంట సేపు చర్చలు జరిపారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయాలనే అమెరికా కు మద్దతు ఇస్తున్నట్లు ముషారఫ్ ప్రకటించడం శేషం.
ఫ్రాన్స్ లో పర్యటించిన అనంతరం ముషారఫ్ వాషింగ్టన్ చేరుకుంటారు. భారత్ సరిహద్దులో అమాయకుల్ని బలిగొంటున్నది పాకిస్తానీలేనంటూ గురువారం రష్యా ప్రకటించింది. వాజ్‌పేయి రష్యాలో పర్యటించిన రెండో రోజను రష్యా ఈ ధంగా ప్రకటించడం శేషం. రష్యా ఈ ధంగా ప్రకటించడం, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకే బుష్ కు మద్దతు ఇచ్చానని ముషారఫ్ చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications
