డెహ్రాడూన్‌ః కాశ్మీర్ లో భారత్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ పాక్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ దుయ్యబట్టారు. ముషారఫ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నిజంగా బరితెగింపేనని అద్వానీ శుక్రవారం డెహ్రాడూన్ లో వ్యాఖ్యానించారు. ముషారఫ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని అద్వానీ మర్శించారు. ఉత్తరాంచల్ ఏర్పాటై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అద్వానీ ప్రసంగించారు.
పాక్ ఆక్రుత కాశ్మీర్ లో వున్న తీవ్రవాద స్థావరాలను ధ్వసం చేస్తే ఎవరూ ఆపలేరని, అయితే సరిహద్దు దాటకూడాదనే నైతిక కట్టుబాటు వుండబట్టే వేచి చూస్తున్నట్లు అద్వానీ చెప్పారు. సరిహద్దు దాటకుండానే పాక్ ఆక్రుత కాశ్మీర్ లోని తీవ్రవాద స్థావరాలను ధ్వసం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాశ్మీర్ లో భారత్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నదంటూ ముషారఫ్ గురువారం పారిస్ లో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
