ఇస్లామాబాద్: అమెరికా వ్యతిరేక ప్రదర్శనకారులపై పాకిస్థాన్‌లో పోలీసులు జరిపినకాల్పుల్లో శుక్రవారంనాడు ముగ్గురు మరణించారు. ఆందోళనకారులు హైవే,రైల్వే లైన్‌పై రాకపోకలను స్తంభింపజేశారు.దాదాపు ఐదు వేల మంది ర్యాడికల్ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ సభ్యులు జైలు వ్యాన్‌ను దగ్ధం చేశారని, నలుగురు పోలీసులను బందీలుగా తీసుకున్నారని, ఆందోళకారులు కొంత మంది ఆటోమేటిక్‌రైఫిళ్లు ధరించి వున్నారని పోలీసు అధికారి డేరా ఘజీఖాన్ చెప్పారు.
ఇస్లామాబాద్: అమెరికా వ్యతిరేక ప్రదర్శనకారులపై పాకిస్థాన్‌లో పోలీసులు జరిపినకాల్పుల్లో శుక్రవారంనాడు ముగ్గురు మరణించారు. ఆందోళనకారులు హైవే,రైల్వే లైన్‌పై రాకపోకలను స్తంభింపజేశారు.
దాదాపు ఐదు వేల మంది ర్యాడికల్ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ సభ్యులు జైలు వ్యాన్‌ను దగ్ధం చేశారని, నలుగురు పోలీసులను బందీలుగా తీసుకున్నారని, ఆందోళకారులు కొంత మంది ఆటోమేటిక్‌రైఫిళ్లు ధరించి వున్నారని పోలీసు అధికారి డేరా ఘజీఖాన్ చెప్పారు.
మతవాద పార్టీలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను పురస్కరించుకుని పాకిస్థాన్ పోలీసులు శుక్రవారంనాడు ఐదు వందల మందికి పైగా మతవాద కార్యకర్తలను అరెస్టు చేశారు. అఎn్ఘానిస్థాన్‌లో అమెరికా దాడులను నిరసిస్తూ మత ఛాందస పార్టీలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అమెరికా దాడులకు నిరసనగా కరాచీలో పెద్ద యెత్తున ప్రదర్శన జరిగింది. ఆ చుట్టు పక్కల కూడా ప్రదర్శనలు జరిగాయి. పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లను అమెరికా సైన్యాలు ఖాళీ చేయాలని ఆందోళన కారులు నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పెషావర్‌లో దాదాపు 250 మందిని పోలీసులుఅరెస్టు చేశారు. మరో 150 మందిని కరాచీలో అరెస్టు చేశారు. మరో 70 మందిని లాహోర్‌లో, 50 మందిని రావల్పిండిలో అదుపులోకి తీసుకున్నట్లు దేశ అంతర్గత రక్షణ మంత్రి చెప్పారు.
అమెరికా సైనిక చర్యకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనల వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ చెప్పారు. ఏ ధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. నిఘానుపెంచారు.












Click it and Unblock the Notifications
