వాషింగ్టన్‌: ఉగ్రవాదుల పన్నాగాలు ఫలించవని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ అన్నారు. ఉగ్రవాదుల చర్యల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన దేశ ప్రజలనుకోరారు. ఉగ్రవాదాన్ని అణచివేసే మహా జాతీయ సవాల్‌కు సహకరించాలని ఆయన శుక్రవారం తెల్లవారుజామున అమెరికా ప్రజలకు జ్ఞప్తి చేశారు.

ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని, ఈ ప్రమాదం పట్ల ప్రజలు జాగరూకులై వ్యవహరించాలని ఆయన అన్నారు. ఉగ్రవాదులు వేటాడడం, భష్యత్తులో టెర్రిరిస్టు దాడులు జరగకుండా తమ రక్షణను పటిష్టపరుచుకోవడం, మంచినిపెంచి పోషించడం తమ ముందున్న సవాళ్లని ఆయన అన్నారు.

సెప్టెంబర్‌ 11వ తేదీన జరిగిన టెర్రిరిస్టు దాడుల తర్వాత తమ బాధ్యతనుపెంచాయని ఆయన అన్నారు. కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడం అవసరమని, ఇందులో ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు. టెర్రిరిస్టులను యుద్ధం చేసి ఓడించడమే ముఖ్యమని ఆయన అన్నారు. శత్రువులుక్రైస్తవులను, యూదులను, అమెరికన్లను మట్టుబెడుతామనిఅంటున్నారని, శత్రువులు తమను లక్ష్యంగా ఎంచుకున్నారని, శత్రువుల ఆట కట్టించడానికిసర్వ సన్నద్ధంగా వున్నామని ఆయన అన్నారు. ఇందులో తాము జయం సాధిస్తామని ఆయన శ్వాసం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+