హైదరాబాద్:పేదలకు అన్యాయం చేసేందుకు తాము సంస్కరణలను అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజక వర్గాల స్థాయి శిక్షణా శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.పేదలకు మేలుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సరిగా వ్యవహరించి వుంటే ఆర్టీసి సమ్మె ఇన్ని రోజులు సాగి వుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజా సంక్షేమం కన్నా ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే ముఖ్యమై పోయిందని, ప్రభుత్వాన్ని ఏ ధంగా ఇబ్బందిపెట్టాలా అని మాత్రమే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాల ధోరణి పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన పార్టీ శ్రేణులనుకోరారు. సమస్యలను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పది రకాల ప్రాణాంతక వ్యాధులను గుర్తించి వాటిని నిర్దిష్ట కాల వ్యవధిలో రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications
