పాక్‌లో భారత దౌత్యాధికారి కిడ్నాప్
ఇస్లామాబాద్: భారత హై కుషనర్ కార్యాలయ ఉద్యోగి దేవేంద్ర కుమార్ గుప్తాను పాకిస్థాన్ గూఢచార సంస్థ అధికారులుగా భాస్తున్నవారు గురువారం రాత్రిఅపహరించారు. ఆయనను బుధవారంనాడే పాకిస్థాన్ బహిష్కరించింది. ఏడు రోజుల లోగా దేశం వదిలి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించింది.
దేవేంద్రకుమార్ గుప్తా గురువారం రాత్రి తన భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా టాక్సీలోంచి లాగి కొట్టుకుంటూ ఈడ్చుకుని వెళ్లారు. ఆయనను ఎక్కడికి తీసుకుని వెళ్లిందీ తెలియదు. ఆయనపై నడి రోడ్డు dుద దౌర్జన్యం చేశారు. ఈ సందర్భంగా జరిగినపెనుగులాటలో గుప్తా భార్య గాయపడ్డారు.
ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందే భారత హై కుషనర్ .కె. నంబియార్ పాక్ దేశాంగ కార్యదర్శి ఇనాముల్ హక్‌ను కలిసి లాహోర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న భారత హై కుషనర్ ఉద్యోగి రdంద్రనాథన్‌ను దూషించడంపై తీవ్ర నిరసన తెలియజేశారు. అదే బస్సులో నాథన్ పక్కసీటులో కూర్చున్న రెహమాన్ ఖాన్ అనే ఐఎస్‌ఐ అధికారి నాథన్ హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కున్నాడు. ఇందులో నాథన్ డబ్బులు పెట్టుకున్నాడు. దీనిపై ఇద్దరి మధ్యపెద్ద యెత్తున వాగ్వివాదం జరిగింది. తరువాత ఆయన బ్యాగ్‌ను తిరిగి ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications
