వాషింగ్టన్‌: తమ దేశంలో పూర్తి రాజకీయ స్థిరత్వం నెలకొన్నదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. తమ ప్రభుత్వ మనుగడకు ఏ ధమైన ఇబ్బందులు లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.భారత చిత్రం మారుతోందని, అభివృద్ధి పరుగు పందెంలో ఇతర దేశాలతో పోటీ పడుతోందని ఆయన అన్నారు. అమెరికాలోని భారత రాయబారి లలిత్‌ మాన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందీలో చలోక్తులు సురుతూ సాగిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. తన ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు గుర్తించాయని ఆయన అన్నారు.

వాషింగ్టన్‌: తమ దేశంలో పూర్తి రాజకీయ స్థిరత్వం నెలకొన్నదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. తమ ప్రభుత్వ మనుగడకు ఏ ధమైన ఇబ్బందులు లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భారత చిత్రం మారుతోందని, అభివృద్ధి పరుగు పందెంలో ఇతర దేశాలతో పోటీ పడుతోందని ఆయన అన్నారు. అమెరికాలోని భారత రాయబారి లలిత్‌ మాన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందీలో చలోక్తులు సురుతూ సాగిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. తన ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు గుర్తించాయని ఆయన అన్నారు.

మూడేళ్లు భారత ప్రధానిగా కొనసాగడం సామాన్యమైన సంగతేం కాదని ఆయనఅన్నారు. భారత దేశానికి ఎవరు వచ్చినా ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు వుంటుందని తనను అడిగేవారని, పరిస్థితి కూడాఅస్థిరంగా వుండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయనచెప్పారు.

ఆయన (వాజ్‌పేయి)ని తొలగిస్తే తిరిగి అధికారంలోకి వస్తాడని ఇప్పుడు ప్రజలు(పార్టీలు) భాస్తున్నారు. మొదటిసారి 13 రోజులకే నా ప్రభుత్వాన్ని కూల్చారు. తిరిగి అధికారంలోకి వచ్చి 13 నెలలు ఉన్నాను. మళ్లీ నన్ను తొలగించారు. ఇప్పుడు నేను స్థిరంగా అధికారంలో వుండడానికే వచ్చాను. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థిరత్వం నెలకొంది అని వాజ్‌పేయి అన్నారు. ప్రగతి పథంలో సాగడానికి దేశం ప్రస్తుతం ప్రపంచ పోటీలో అగ్రభాగాన వున్నదని ధీమాగా చెప్పగలనని ఆయన అన్నారు.
దేశ ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, దేశంపెద్ద మార్కెట్‌గా ఎదిగిందని, ప్రజల కొనుగోలు శక్తిపెరిగిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+