కాబూల్ ఉత్తరాన అమెరికా దాడులు
కాబూల్: అమెరికా వైమానిక దాడులు శుక్రవారం నాడు కొనసాగాయి. కాబూల్‌ఉత్తర ప్రాంతంలోని తాలిబాన్ స్థావరాలపై అమెరికా పెద్ద యెత్తున వైమానిక దాడులునిర్వహించింది.
నార్తర్న్ అలయెన్స్‌సేనలు మజారే షరీఫ్‌కు అత్యంత చేరువలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వైమానిక దాడులను ఆసరాగా తీసుకుని నార్తర్న్ అలయెన్స్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇంత ఉధృతమైన దాడులు ఇంతకు మందు జరగలేదని, తాలిబాన్ల లక్ష్యాలు అనేకం ధ్వంసమయ్యాయని నార్తర్న్ అలయెన్స్ ప్రతినిధిఅంటున్నారు.
మరిన్ని పదాతి దళాలను అఎn్ఘానిస్థాన్‌లోకి పంపనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి రమ్స్‌ఫీల్డ్ చెప్పారు. అమెరికాకు సహకరించేందుకు జపాన్ మూడు పడవలను పంపుతోంది. ఈ పడవలు సముద్రంలోకి అడుగుపెట్టాయి.












Click it and Unblock the Notifications
