ఆంధ్రకు తప్పిన వాయుగండం
హైదరాబాద్‌ః నాలుగురోజులుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వణికిస్తున్న వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మారినట్లు శాఖపట్నంలోని వాతావరణ శాఖ తెలిపింది.పైగా అది తీరానికి దూరంగా కూడా పయనిస్తుండడంతో కోస్తా తీరానికి ఏ మాత్రం ముప్పు వాటిల్లక పోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు రోజుల కిందట కోస్తా ప్రాంతాన్ని, ఆ తరువాత ఉత్తర కోస్తా ప్రాంతాన్ని వాయుగుండం గడగడ లాడించింది. దీపావళి సమయంలో ఆనవాయితీగా వచ్చే తుపాను మళ్ళీ ఎక్కడ వచ్చి పడుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాయుగండం తప్పిపోవడంతో ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications
