దోహా: డబ్ల్యుటివో తాజా చర్చలకు వర్ధమాన దేశాలను ఒప్పించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ చేసిన యత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ షయంలో పలు వర్ధమాన దేశాలు భారత్ వాదనను బలపరిచాయి. తాజా చర్చలను వ్యతిరేకిస్తూ డబ్ల్యుటివో మంత్రుల స్థాయి సదస్సులో భారత్‌తో గొంతు కలిపాయి.
కొత్తఅంశాలపై చర్చను వ్యతిరేకిస్తున్నది భారత్ ఒక్కటే కాదని, ఈ షయంలో భారత్ ఎంత మాత్రం ఏకాకి కాదని డబ్ల్యుటివో ప్రతినిధి ఒకరు ఆదివారం ఆన్నారు. వర్ధమాన దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న 93అంశాల్లో నలభై ఒక్కటిని పరిష్కరించేందుకు అమెరికా, ఈయూలుఅంగీకరించినట్లు ఆయన తెలిపారు.
పెట్టుబడులు, పోటీ పద్ధతి వంటి కొత్త అంశాలను ఎజెండాలో చేర్చాలన్న సంపన్న దేశాల ప్రతిపాదనను భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాలు, పలు ఆఫ్రికా దేశాలు తేల్చి చెప్పినట్లు ఆయన తెలిపారు.లాటిన్ అమెరికా దేశాలు కూడా కొన్ని సంపన్న దేశాలను ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కొత్తగా డబ్ల్యుటివోల సభ్య దేశంగా చేరిన చైనా తాజా చర్చలకు మద్దతిస్తానని తెలియజేసింది.












Click it and Unblock the Notifications
