శ్రీనగర్‌ః కాశ్మీర్ వాదంతో సంబంధం వున్న అన్ని పార్టీల మధ్య కాల్పుల రమణకు ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ ప్రతిపాదించింది. కాశ్మీర్ లోయలో ఉద్రిక్తతల నివారణకు భారత్-పాకిస్తాన్ తక్షణమే చర్చలు ప్రారంభించాలని కూడా హురియత్‌జ్ఞప్తి చేసింది.
కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సమస్యతో సంబంధం వున్న అన్ని పార్టీలు వెంటనే కాల్పుల రమణను పాటించాలని దీనివల్ల చర్చలకు అనువైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని హురియత్ నేత అబ్లుల్ గనీ భట్ చెప్పారు. 50 ఏళ్లుగా నానుతున్న ఈ సమస్యను భారత్, పాకిస్తాన్ కాశ్మీర్ ప్రజలు ఉమ్మడిగా పరిష్కరించుకోగలరని ఆయన చెప్పారు. చిరకాలం నిలిచిపోగల శాశ్వత పరిష్కారం కోసం అన్వేషించాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్, పాలస్తీనా ప్రాధాన్యతాంశాలుగా మారాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
