ఖాట్మాండుః నేపాల్ రాజకుటుంబానికి చెందిన యువరాణి ఒకరు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మొత్తం ఆరుమందితో బయలుదేరిన హెలికాప్టర్ ముగు జిల్లాలోని రార సరస్సు ప్రాంతంలో కూలినట్టుగా అధికారులు చెప్పారు.
ఈ హెలికాప్టర్‌లో దివంగత యువరాజు ధీరేంద్ర అర్ధాంగి ప్రేక్ష్యా రాజ్య లక్ష్మీదే షా తో పాటు మరో అయిదుగురు వున్నట్టుగా రాజభవన్‌వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది జూన్ ఒకటిన యువరాజు దీపేంద్ర తన తల్లితండ్రులను తోబుట్టువులను కాల్చిచంపిన ఘటనలో ధీరేంద్ర కూడా కన్నుమూశారు. దివంగత మహరాణి కోమల్ రాజ్యలక్ష్మీదే షాకు ప్రేక్ష్యా స్వయంగా తోబుట్టువు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని dరంతా టూరిస్ట్ కేంద్రమైన ముగుకు బయలుదేరారని తెలిసింది.మృతులంతా రాజకుటుంబానికి చెందిన వారేనని తెలిసింది. ఈ ఏడాది రాజకుటుంబానికి ఇది రెండో భారీ షాదం.












Click it and Unblock the Notifications
